Sai Pallavi: ‘నాగ చైతన్య 23’ లో ముందుగా ఆమెను అనుకున్నారట.. కానీ..?

నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి కలయికలో ‘ప్రేమమ్’ ‘సవ్యసాచి’ వంటి సినిమాల తర్వాత ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘#NC23 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్‌’ సంస్థ నిర్మిస్తుంది. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైనట్టు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.

ఆల్రెడీ నాగ చైతన్య- సాయి పల్లవి (Sai Pallavi) కలిసి ‘లవ్ స్టోరీ’ అనే సూపర్ హిట్ సినిమాలో నటించారు. అందులో వీళ్ళ పెయిర్ కి అలాగే నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ బిగ్ బడ్జెట్ మూవీ కోసం మరోసారి జత కట్టనున్నారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి ముందుగా ఈ ప్రాజెక్టులో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకున్నారు మేకర్స్. నాగ చైతన్య – కీర్తి సురేష్ ల కాంబో కూడా ఫ్రెష్ గా ఉంటుంది అని భావించింది.

కీర్తి సురేష్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఏమైందో ఏమో కానీ.. సాయి పల్లవి ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడం…జరిగింది. సాయి పల్లవికి ఆల్రెడీ అల్లు అరవింద్ అండ్ టీం అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ మార్పుకి కారణమేంటో తెలియాల్సి ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus