మలయాళంలో నటీనటులను సమానంగా చూస్తారంటూ చురకలు!

తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో యూత్ లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ‘ఎంసీఏ’, ‘పడి పడి లేచే మనసు’ లాంటి సినిమాల్లో నటించింది. తమిళంలో ఆమె నటించిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ‘మారి 2’, ‘ఎన్జీకే’ లాంటి సినిమాలు ప్లాప్ అయినప్పటికీ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సినిమాకి కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఈ బ్యూటీకి తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ దక్కింది. అలాంటిది ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మలయాళం సినిమా ఇండస్ట్రీకి మధ్య మీరు గమనించిన తేడాలేంటి..? అని ఆమెని ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తెలుగు నటులను దర్శక నిర్మాతలు చాలా గారం చేస్తుంటారని.. స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారని చెప్పిన సాయి పల్లవి మలయాళం ఇండస్ట్రీలో పరిస్థితి అలా ఉండదని.. అందరికీ సమానంగా చూస్తారని చెప్పింది.

సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలానే కమర్షియల్ యాడ్స్ లో నటించడం తనకు నచ్చదని.. ప్రజలను మానిప్యులేట్ చేయడం తనకు ఇష్టం లేదని.. అందుకే ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లో నటించలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘విరాటపర్వం’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించనుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus