కొత్త ఎక్స్ పెరిమెంట్ కు రెడీ అయిన రౌడీ బేబీ..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. ఆ చిత్రంలో తెలంగాణ స్లాంగ్ లో ఈమె చెప్పిన డైలాగ్ లు ఇప్పటికీ ప్రేక్షకుల నోట్లో నానుతూనే ఉన్నాయి. ఇక ఆ చిత్రం తరువాత నాని తో చేసిన ‘ఎం.సి.ఎ’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.ఆ చిత్రంలో నాని- సాయి పల్లవి జంటకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ‘ఏవండోయ్ నాని గారు’ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.

మళ్ళీ ఈ పెయిర్ ను మరో సినిమాలో చూడాలని కూడా చాలా మంది కోరుకున్నారు. ఎట్టకేలకు ఆ కాంబో ఫిక్స్ కాబోతుంది. నాని నెక్స్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ’ లో సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని టాక్. అయితే ఈ చిత్రంలో సాయి పల్లవి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట.

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతే కాదు నాని ఈ చిత్రంలో డబుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus