భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

హీరోహీరోయిన్లు నిజ జీవితంలో భార్యాభర్తలు అయితే.. ఇద్దరి అభిమానుల నుండి ఎక్కువగా వినిపించే డిమాండ్‌.. మీ ఇద్దరూ ఓసారి కలసి పని చేయడం. ఓ సినిమాలో ఇద్దరినీ చూడాలని ఉంది అని. ఇలాంటి స్టార్‌ కపుల్స్‌కి అభిమానుల నుండి ఈ కోరిక ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కొంతమంది అలా చేస్తే.. కొంతమంది ఆ ప్రయత్నంలో ఉన్నామని చెబుతూ ఉంటారు. అయితే ప్రముఖ బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ మాత్రం వేరేలా స్పందించాడు. జీవిత భాగస్వామి, స్నేహితులతో కలసి పనిచేయడం సరికాదు అని అంటున్నాడు.

Saif Ali Khan

ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్‌ అలీ ఖాన్‌.. తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అలాగే స్నేహితులు, లైఫ్‌ పార్ట్‌నర్‌తో కలసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గురించి కూడా మాట్లాడాడు. 90ల కాలంలో తనకు ఎక్కువ అవకాశాలు రావడం.. ఓ అదృష్టమని ప్రేక్షకులు అనేవారని.. కానీ బలమైన కథలు, ప్రధాన పాత్రలు రావడం లేదని అప్పట్లో తనకు అనిపించేదని సైఫ్‌ చెప్పాడు. ఆ తర్వాతే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రయోగాలు చేశానని చెప్పాడు.

సహనటులతో పనిచేస్తున్నప్పుడు ఛాలెంజింగ్‌గా తీసుకొని నేను టాప్‌ గేర్‌లో పని చేస్తాను అనిపించేది అని తన సక్సెస్‌ మంత్ర చెప్పుకొచ్చాడు. ఇక జీవిత భాగస్వామితో కలసి పనిచేసేటప్పుడు కష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు సైఫ్‌. అందుకే కరీనా కపూర్‌తో కలసి నటించడానికి అంతగా ఆసక్తి చూపించను. స్నేహితులతో వర్క్‌ చేయడం సౌకర్యవంతంగా అనిపించవచ్చు కానీ అది సహనటులను దూరం చేస్తుందని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు సైఫ్‌ అలీ ఖాన్‌.

సైఫ్‌ పెళ్లికి ముందు కరీనా కపూర్‌తో ‘ఎల్‌వోసీ కార్గిల్‌’, ‘ఓంకార’, ‘ఏజెంట్‌ వినోద్‌’ తదితర సినిమాల్లో నటించాడు. పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం అడిగితేనే సైఫ్‌ పై విషయానల్నీ చెప్పుకొచ్చాడు. ఇదేం లాజిక్కో కదా!

గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus