బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. గురువారం నాడు(16-01-2025) తెల్లవారుఝామున 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు స్పష్టమవుతుంది.అసలేమైందంటే.. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. దీంతో అప్రమత్తమైన సైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.. ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నించగా… ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది.
Saif Ali Khan
సైఫ్ అలీ ఖాన్ ఒంటిపై ఆరు చోట్ల ఆ దొంగ కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ కత్తి పోట్లు లోతుగా దిగడంతో బ్లడ్ పోయినట్టు సమాచారం.వెన్నెముకకి కూడా గాయమైందని అంటున్నారు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. ప్రస్తుతం సైఫ్ కి సర్జరీ జరుగుతున్నట్టు సమాచారం.
ఇక ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందించాడు. విషయం తెలిసిన వెంటనే తాను షాక్ కి గురైనట్టు ఎన్టీఆర్ తెలిపాడు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు కూడా.. ఎన్టీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అలాగే దేవర నిర్మాతలైన ‘యువ సుధా ఆర్ట్స్’ వారు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
ఇక బాలీవుడ్ నటుడైనప్పటికీ సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమాలో కూడా నటించాడు.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.