Saikumar, Nagarjuna: ఆ సినిమాలో నాగార్జున పాత్రకి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారట..!

కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభం నుండి సినిమాల విషయంలో చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది కొత్త వాళ్లకు లైఫ్ ఇచ్చిన ఘనత నాగార్జున సొంతం. హీరోయిన్లతో రొమాన్స్ చేసినా, ‘అన్నమయ్య’ అంటూ కీర్తనలు పాడినా ఆయనకే చెల్లింది. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు నాగార్జున. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై రూపొందించారు. ప్రస్తుతం ‘నా సామి రంగ’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు నాగార్జున.

ఇదిలా ఉంటే… నాగార్జున (Nagarjuna) తాను నటించే ప్రతి సినిమాకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. ఆయన వాయిస్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే నాగార్జున నటించిన ఓ సినిమాకి మాత్రం సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారట. వివరాల్లోకి వెళితే.. అమితాబ్‌బ‌చ్చ‌న్‌, శ్రీదేవి, నాగార్జున కాంబినేషన్లో 1992లో ‘ఖుదా గ‌వా’ అనే సినిమా వచ్చింది. పీరియాడిక‌ల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

రూ.8 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర‌కు సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్ప‌డం జరిగింది. బహుశా ఇది చాలా మందికి తెలిసుండదు. అలాగే నాగార్జున నటించిన పలు హిందీ సినిమాలకి వేరే ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించుకున్నారు. అయితే ‘ఖుదా గ‌వా’ కి మాత్రం మన సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus