సలార్ మూవీ సంచలనాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ డే టికెట్స్ దొరకడం కష్టమవుతోంది. ఈ సినిమా బుకింగ్స్ చూసి ప్రభాస్ బాక్సాఫీస్ కింగ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బుక్ మై షోలో ఈ సినిమాకు ఏకంగా 18 లక్షల లైక్స్ వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్లతో పాటు ఆక్యుపెన్సీ విషయంలో సైతం సలార్ మూవీ టాప్ లో నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శని, ఆదివారాల్లో కూడా సలార్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సలార్ బుకింగ్స్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ సలార్ పీవీఆర్, ఐనాక్స్ లలో, మిరాజ్ థియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఈ సినిమాకు వచ్చిన నష్టం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డంకీకి పరవాలేదనే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నా సలార్ కు మాత్రం డంకీ పోటీనివ్వడం లేదు.
డంకీ సినిమాకు టాక్ బాగానే ఉన్నా సలార్ ప్రభంజనం వల్ల డంకీకి ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరగడంతో ఈ సినిమాపై ఇతర సౌత్ భాషల్లో సైతం అంచనాలు పెరుగుతున్నాయి. నార్త్ సిండికేట్ కు షాకిచ్చే దిశగా సలార్ నిర్మాతలు అడుగులు వేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
సలార్ (Salaar) రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలను కొనసాగిస్తోంది. ప్రభాస్ కెరీర్ లో సలార్ స్పెషల్ మూవీగా నిలిచిపోనుంది. రాబోయే రోజుల్లో సలార్ ఏ రేంజ్ లో రికార్డులను సాధిస్తుందో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమాకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.