పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’ నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు ఈ చిత్రాన్ని తీశాడని, 6 ఏళ్ళ ఆకలి తీర్చేశాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో కల్ట్ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘సలార్’ విషయంలో మాత్రం ఎలివేషన్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు.
డ్రామానే ఎక్కువగా నడిపించాడు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడానికి అదే మెయిన్ రీజన్ అయ్యింది. అందుకే క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ‘సలార్’ కి యూనానిమస్ గా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పాలి. అయితే మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, రికార్డు ఓపెనింగ్స్ సాధించిందా అనే డౌట్ అందరిలో ఉంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం అయితే.. ‘సలార్’ మొదటి రోజు రూ.175 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది అంటున్నారు.
నిర్మాతలైన ‘హోంబలే ఫిలిమ్స్’ వారు అయితే ఇంకా అధికారికంగా అలాంటి నంబర్స్ ను ప్రకటించింది లేదు. ఒకవేళ నిజంగా మొదటి రోజు రూ.175 కోట్లు గ్రాస్ ను రాబట్టి ఉంటే.. మాత్రం అది ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకి ప్రమోషన్ ఎక్కువగా చేసింది లేదు,
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా పోటీగా ఉండటం వల్ల నార్త్ లో ఎక్కువ స్క్రీన్స్ దక్కలేదు. అలాగే ఆంధ్రాలో టికెట్ రేట్ల హైక్స్ ఎక్కువగా దక్కలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ కూడా (Salaar) ‘సలార్’ రూ.175 కోట్లు కలెక్ట్ చేసి ‘కె.జి.ఎఫ్ 2 ‘ ఓపెనింగ్స్ ను అధిగమించడం అంటే మాటలు కాదు.