పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేకపోవడంతో అభిమానులు థియేటర్ వద్దకు తరలివచ్చి సినిమా టికెట్లను బుక్ చేసుకుంటూ ఉన్నారు దీంతో సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరో రెండు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి RRR సినిమా రికార్డులను సలార్ సినిమా బీట్ చేసిందని తెలుస్తోంది. RRR సినిమా అన్ని భాషలలో సాటిలైట్ రైట్స్ 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి కానీ సలార్ సినిమా తెలుగులో మాత్రమే 22 కోట్లకు అమ్ముడు పోయాయనే తెలుస్తుంది కేవలం సాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా డిజిటల్ రైట్స్ విషయంలో కూడా సలార్ సినిమా RRR సినిమాను బీట్ చేశాయని చెప్పాలి.
RRR సినిమా సినిమా డిజిటల్ అలాగే సాటిలైట్ రైట్స్ కలిపి 325 కోట్ల రూపాయలకు అమ్ముడు పోగా సలార్ సినిమా మాత్రం 350 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పాలి ఇలా ఈ సినిమా విడుదలకు ముందే RRR సినిమా రికార్డులను బ్రేక్ చేయడం గమనార్హం. ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా (Salaar) నుంచి విడుదలైనటువంటి మొదటి ట్రైలర్ చిన్న నిరాశ కలిగించినప్పటికీ అనంతరం సూరీడు అనే సాంగ్ తో పాటు రెండో ట్రైలర్ కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. బాహుబలి తర్వాత ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోలేక ప్రభాస్ సతమతం అవుతున్నారు. మరి ఈ సినిమా ఈయనకు సక్సెస్ అందించేనా లేదా అనేది మరొక రెండు రోజులలో తెలియనుంది