పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న తెలుగు, కన్నడంతో పాటు హిందీ, తమిళ,మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్లు… బాగానే ఉన్నాయి.
ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్ అయితే.. సినిమా పై అంచనాలు డబుల్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా రన్ టైం కూడా 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్టు సెన్సార్ రిపోర్ట్ ద్వారా అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేయడం జరిగిందట. వారి టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రెండు ట్రైలర్లు చూస్తే.. కథ ఏమిటి అన్నది అందరికీ ఒక ఐడియా వచ్చేసింది.
కష్టాల్లో ఉన్న స్నేహితుడు కోసం ఫైట్ చేయడానికి హీరో రావడం…, ఆ స్నేహితుడి కల నెరవేర్చిన తర్వాత అతనితో శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేది ‘సలార్’ కథాంశం. అయితే మొదటి పార్ట్ లో స్నేహితుడి కోసం హీరో చేసిన పోరాటాన్నే చూపించబోతున్నట్టు అంటున్నారు. సెకండ్ పార్టులో వారి మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని చూపిస్తారని టాక్. ఇక (Salaar) ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ విషయానికి వస్తే .. ఫస్ట్ హాఫ్ పరంగా డీసెంట్ గా ఉందని అంటున్నారు.
ప్రభాస్ ఎంట్రీ సీన్, చున్నీ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటాయట. ఇక సెకండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ని చూపిస్తారట. అయితే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ నుండి ఉంటాయని అంటున్నారు. యాక్షన్ డోస్ ఎక్కువ అనిపించినా.. ప్రభాస్ ఫ్యాన్స్ ను, మాస్ ఆడియన్స్ ను ఈ మూవీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్టు వినికిడి.