సాధారణంగా పెద్ద సినిమాలు హిట్ కావాలంటే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలి. అయితే సలార్ సినిమా మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు డబ్బులు వేస్ట్ అని ప్రూవ్ చేసింది. సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉంటే మూవీ సక్సెస్ సాధిస్తుందని భారీ స్థాయిలో ప్రమోషన్స్ అవసరం లేదని క్లారిటీ వచ్చేసింది. కంటెంట్ బాగుంటే ప్రమోషన్స్ లేకుండానే సినిమా సక్సెస్ సాధిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో భవిష్యత్తులో పెద్ద సినిమాలు సైతం కంటెంట్ అద్భుతంగా ఉంటే భారీ సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.
భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడం వల్ల నిర్మాతలపై భారం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి ఈవెంట్లలో కొన్నిసార్లు ఫ్యాన్స్ కు గాయాలు అయిన సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే. సలార్ సక్సెస్ తో ప్రభాస్ నటన గురించి మరింత పాజిటివ్ గా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్2 కథకు సంబంధించి ట్విస్టులు ఇవేనంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
సలార్ (Salaar) సినిమాకు యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. సలార్2 మూవీలో మరిన్ని షాకింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. ఖాన్సార్ సామ్రాజ్యాన్ని సృష్టించి కథ, కథనాన్ని ప్రశాంత్ నీల్ మలచిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలామంది డైరెక్టర్లతో పోలిస్తే ప్రశాంత్ నీల్ భిన్నమని అయితే అలా ఉండటమే ప్రశాంత్ నీల్ కు ఎంతగానో కలిసొస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ రేంజ్ లో ఉండనుండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. సలార్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఫస్ట్ వీకెండ్ సమయానికి ఈ సినిమా 400 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.