ఒక సినిమాను రెండు పార్టులుగా తీస్తే ఏమొస్తుంది… ఈ ప్రశ్నకు స్ట్రెయిట్ సమాధానం చెబితే, ముందు హైప్ వస్తుంది, తర్వాత ఉచిత ప్రచారం లభిస్తుంది, ఆ తర్వాత నిర్మాతకు డబ్బులొస్తాయి. ఈ సినిమాలో ఏముందబ్బా రెండు పార్టులు తీస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా ప్రచారం జరుగుతుంది. ఆఖరిగా ఒకే బ్రాండ్ (సినిమా పేరు)తో రెండు సినిమాలు వచ్చి నిర్మాతకు డబ్బులొస్తాయి. ‘బాహుబలి’ సినిమా విషయంలో జక్కన్న రాజమౌళి చేసిన పని ఇదే.
సినిమా పేరుకు అప్పటికే బాగా బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. దీంతో రెండు పార్టులు అని అనౌన్స్ చేసి హైప్ అండ్ ప్రచారం సాధించారు. ఆటోమేటిక్‌గా సినిమాకు భారీ లాభాలు (?) కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా ఒక్క పార్టులో తీసినా అయిపోయేది. ఆ తర్వాత ఈ ప్రయత్నం సుకుమార్ – అల్లు అర్జున్ చేస్తున్నారు. ‘పుష్ప’ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. వీరిద్దరిని చూసో లేక వాళ్లకొచ్చిన ఆలోచన వచ్చిందో కానీ…
ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కూడా అదే ఆలోచిస్తున్నారట. ‘సలార్’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారు. ప్రస్తుతం టీమ్‌లో దీని మీదే డిస్కస్ జరుగుతోందని సమాచారం. ఒకవేళ అందరూ ఓకే అనుకుంటే… ‘సలార్’ను కూడా రెండు భాగాలుగా చూడొచ్చు. నిర్మాత మంచి లాభాలు పొందొచ్చు.