Salman, Vicky: విక్కీ కౌశల్‌ను పక్కకు తోసేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌… పాత కోపాలా.. క్లారిటీ ఇదిగో!

యువ హీరో విక్కీ కౌశల్‌, స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్‌ను సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డులు పక్కకు నెట్టేశారు అంటూ ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుండి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సల్మాన్‌ టీమ్‌ అలా చేయకూడదు అని కొందరు అంటుంటే… అసలు అక్కడేమైంది అంటూ ఇంకొందరు ఆరా తీశారు. అయితే ఈ విషయంలో శనివారం సాయంత్రం క్లారిటీ వచ్చింది అని చెప్పొచ్చు.

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు (ఐఫా) 2023కు సంబంధించి మీడియా సమావేశం దుబాయ్‌లో జరిగింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈవెంట్‌లో పాల్గొన్న వారితో విక్కీ కౌశల్‌ ఫొటోలు దిగుతుండగా.. అటుగా సల్మాన్‌ ఖాన్‌ వచ్చాడు. దీంతో సల్మాన్‌ బాడీగార్డ్స్‌ విక్కీని పక్కకు తోసేశారు.

ఇదిలా జరిగినప్పుడు విక్కీ ఏదో మాట్లాడుతున్నప్పటికీ (Salman) సల్మాన్‌ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో సల్మాన్‌, ఆయన బాడీగార్డ్స్‌ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని సల్మాన్‌ ఇలా చేశారు అని కూడా నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా సల్మాన్‌ అభిమానులు మరొక వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

విక్కీ – సల్మాన్‌ బాడీగార్డ్స్‌ ఘటన తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో సల్మాన్‌, విక్కీ కౌశల్‌ కలిసి వేదికను పంచుకున్న వీడియో అది. ఆ వీడియోలో సల్మాన్‌ నేరుగా వెళ్లి, విక్కీ కౌశల్‌ను ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఘటనపై విక్కీ కౌశల్‌ స్పందించాడు. చాలాసార్లు అనవసర విషయాలు పెద్దవిగా కనపడతాయి అన్నాడు. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్న వీడియోలో చూసినట్లు అక్కడేమీ జరగలేదని చెప్పారు. అసలు ఈ విషయం గురించి మాట్లాడటానికి ఏమీ లేదని విక్కీ కౌశల్‌ చెప్పాడు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus