అల వైకుంఠపురంలో చిత్ర నిర్మాతలు నేడు బన్నీ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సూపర్ హిట్ సాంగ్ సామజవరగమనా సాంగ్ ఫీమేల్ వర్షన్ విడుదల చేయడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోని సామజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అలవైకుంఠపురంలో చిత్రం నుండి మొదటి పాటగా విడుదల చేసిన సామజవరగమనా సాంగ్ విడుదల చేయగా అది ఒక ప్రభంజనంలా మారింది. సాంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ కంపోజ్ చేసిన ట్యూన్ యూత్ ని కట్టిపడేసింది. ఆ స్వరాలకు సీతారామ శాస్త్రి సాహిత్యం సిద్ శ్రీరామ్ మధుర గానం తోడవ్వడంతో మ్యూజిక్ లవర్స్ కి ఫేవరేట్ సాంగ్ గా మారిపోయింది.
యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకున్న ఈ పాటకు ఫిమేల్ వర్షన్ విడుదల చేశారు. ఐతే అనూహ్యంగా శ్రేయా ఘోషల్ పాడిన సామజవరగమనా ఫిమేల్ వర్షన్ నిరుత్సాహం కలిగించేదిగా ఉంది. సామజవరగమనా సాంగ్ ఫిమేల్ వర్షన్ కవర్ సాంగ్ పేరుతో విడుదలైన ఈ సాంగ్ ఒరిజినల్ ఫ్లేవర్ ని పాడుచేసింది. దేశంలోనే టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ పాట పాడితే అది హిట్ అనుకోవడమే. ఆర్డినరీ ట్యూన్ కూడా ఆమె గొంతులో ఎక్సట్రార్డినరీ గా పలుకుతుంది. అలాంటిది సూపర్ హిట్ ట్యూన్ కి ఆమె పాడిన ఫిమేల్ వర్షన్ ఎక్కడో కొట్టిందనిపించింది. అసలు ఏమాత్రం ఆసక్తికలిగించకుండా ఆ పాట సాగింది.
బహుశా సిద్ శ్రీరామ్ పాటను మనం అమితంగా ఇష్టపడటం, అనేక మార్లు వినడం వలన నచ్చడం లేదా… అని కూడా అనిపిస్తుంది. ఐతే ఒరిజినల్ ఫ్లేవర్ ఐతే ఈ పాట మిస్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ పాట విన్న తరువాత ఈ ఫిమేల్ వర్షన్ విడుదల చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. కాగా అలవైకుంఠపురంలో చిత్ర విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.