మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నా.. ‘భోళా శంకర్’ పై బజ్ మాత్రం హైప్ క్రియేట్ చేయలేకపోయారు. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు కావడం. గతంలో మెహర్ రమేష్ తీసిన ‘శక్తి’ ‘షాడో’ వంటి చిత్రాలు బయ్యర్స్ కి భారీ నష్టాలు మిగిల్చాయి. ఆ సినిమాల దెబ్బ నుండి నిర్మాతలు అంత ఈజీగా కోలుకోలేకపోయారు.
అంతేకాకుండా నిర్మాత అనిల్ సుంకర గత సినిమాలు కూడా ‘మహాసముద్రం’ ‘ఏజెంట్’ వంటివి కూడా బయ్యర్స్ కి భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ కారణాల వల్ల ‘భోళా శంకర్’ బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు అవుతుంది. ఓవర్సీస్ లో ‘మహాసముద్రం’ ‘ఏజెంట్’ చిత్రాలు మిగిల్చిన నష్టాలకిగాను ‘భోళా శంకర్’ రైట్స్ ను తక్కువ రేటుకి ఇవ్వాలని అక్కడి మేకర్స్ నిర్మాతలను డిమాండ్ చేశారు.
అయితే ‘మహాసముద్రం’ ‘ఏజెంట్’ సినిమాలు కొనుగోలు చేసిన ఓవర్సీస్ బయ్యర్ ఇటీవల ‘సామజవరగమన’ రైట్స్ కూడా తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్కడ భారీ లాభాలను అందించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ అక్కడ వన్ మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టింది. అందువల్ల ‘భోళా శంకర్’ (Bhola Shankar) ఓవర్సీస్ బిజినెస్ కి కొంత రిలీఫ్ ఇచ్చినట్టయ్యింది. ఈ సినిమాకి కనుక హిట్ టాక్ వస్తే… మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉంటుంది.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!