సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా రూపొందింది. వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ లభించింది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. వర్ష బొల్లమ్మ, కావ్య థాఫర్..లు ఇందులో హీరోయిన్లు. గతంలో సందీప్ కిషన్ – విఐ ఆనంద్ కాంబినేషన్లో ‘టైగర్’ అనే మూవీ వచ్చింది.
అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ రకంగా కూడా ఈ సినిమా పై మంచి హైప్ ఉంది అని చెప్పాలి. సందీప్ కిషన్ కూడా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ అధినేత అనిల్ సుంకర సమర్పణలో ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ‘సామజవరగమన’ సినిమాకి కూడా వీళ్ళే నిర్మాతలు.అంతేకాదు (Ooru Peru Bhairavakona) ‘ఊరు పేరు భైరవకోన’ కి కూడా ‘సామజవరగమన’ సెంటిమెంట్ ఫాలో అవ్వాలని వీళ్ళు డిసైడ్ అయ్యారట.
ఎలా అంటే.. ‘సామజవరగమన’ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. అయితే జూన్ 27 నైట్ నుండే ప్రీమియర్స్ వేశారు.సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చి.. త్వరగానే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అందుకే ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16 న రిలీజ్ అవుతుంటే ఫిబ్రవరి 14 నుండే ప్రీమియర్స్ వేయబోతున్నారు. మరి ‘సామజవరగమన’ సెంటిమెంట్ ప్రకారం ‘ఊరు పేరు భైరవకోన’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి