Allu Arha: అర్హ గురించి సమంత మాటలు విన్నారా!

‘శాకుంతలం’ సినిమాలో అల్లు అర్జున్‌ కూతురు అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఆమె తొలి రోజు షూటింగ్‌ జరిగినప్పుడు ఏ రేంజిలో హంగామా చేశారో మనందరం చూశాం. అర్హ కూడా అద్భుతంగా నటించింది అని సెట్‌లో వాళ్లు చెబుతున్నారు. తాజాగా అర్హ గురించి ‘శాకుంతల’ సమంత కూడా మాట్లాడింది. అర్హ గురించి, ఆమె నటన గురించి ఘనంగా చెప్పుకొచ్చింద సమంత. ఆమె మాటలు వింటుంటే అర్హ రాక్‌ స్టార్‌ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.

Click Here To Watch

అర్హ రాక్‌స్టార్‌ అవ్వడానికే పుట్టింది. చిత్ర పరిశ్రమను షేక్ చేస్తుంది అంటూ పొగిడేస్తోంది సమంత. అర్హ గురించి ఎంత చెప్పినా తక్కువే. సెట్‌లో 300 మంది ఉన్నా… ఎంతో కాన్ఫిడెన్స్‌తో నటించింది. అర్హని చూస్తే అద్భుతం అనిపించింది. అంతేకాదు తెలుగు అద్భుతంగా మాట్లాడుతోంది. ఇంకా చెప్పాలంటే ఆమె సూపర్ స్టార్ అవ్వడానికే పుట్టింది. అర్హ నాతో అరంగేట్రం చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. ‘శాకుంతలం’ సినిమా చూసిన తర్వాత మీరూ నాతో ఏకీభవిస్తారు అని చెబుతోంది సమంత.

‘అల వైకుంఠపురములో…’ సినిమా ప్రచారంలో భాగంగా ‘OMG డాడీ…’ అర్హ, అయాన్‌ ఓ పాట చేశారు గుర్తుందా. అందులో అర్హ భలే ముద్దుగా చిన్న చిన్న మూమెంట్స్‌ వేసింది. ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా భలే క్యూట్‌గా అనిపించాయి. ఆ తర్వాత ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది అని చెప్పారు. చిన్ననాటి భరతుడిగా అర్హ కనిపించనుంది అర్హ. సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్ష్‌ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే సమంత ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. సమంత అందంగా, మహారాణిలా చూపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెల్లటి చీరకు గులాబీ పూల అంచుతో సమంత ఆ లుక్‌లో అదిరిపోయిందనే చెప్పాలి. నిర్మాణానంతర కార్యక్రమాలు ఓ కొలిక్కి వచ్చాక సినిమా విడుదలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరలో సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ వస్తుందని సమాచారం.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus