Samantha: హీరోయిన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో సమంత…

రిలేషన్‌షిప్‌ బ్రేకప్‌ అయ్యాక… సమంత జోరు పెంచింది అని తెలుసుగా… తెలుగు, తమిళం బైలింగ్వల్‌ రెండు సినిమాలు వెంటవెంటనే అనౌన్స్‌ చేసేసింది. ఇప్పుడు బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టింది సమంత. దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్‌ త్వరలోనే వస్తుందని టాక్‌. అవును సమంత బాలీవుడ్‌ సినిమాను ప్రకటించేస్తోందట. అది కూడా స్టార్‌ హీరోయిన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో అని టాక్‌. బాలీవుడ్‌లో అవుట్‌ సైడర్‌ ఫిల్మ్స్‌ పేరుతో తాప్సి ఇటీవల ఓ బ్యానర్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే.

ఇందులో ఆమె నటించడంతోపాటు, ఇతర హీరోయిన్లతో కూడా సినిమాలు చేస్తానని అప్పుడే ప్రకటించింది. అందులో భాగంగా తొలి సినిమా సమంతతోనే అని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని భోగట్టా. హిందీ, తెలుగులో ఏక కాలంలో ఈ సినిమా రూపొందిస్తారని సమాచారం. సమంతకు ఇప్పటికే బాలీవుడ్‌తో పరిచయం ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెరపై కనిపించడం మాత్రం ఇదే తొలిసారి అవుతుంది.

అయితే తాప్సి లాగా సమంత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తుందా? అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. గ్లామర్‌ను పండించే సినిమాలు కూడా చేసే అవకాశం ఉందని టాక్‌. చూద్దాం సామ్‌ ఎలాంటి సినిమాలు చేస్తుందో.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus