క్రియేటివ్ డైరెక్టర్స్ కుమార్ అల్లు అర్జున్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో రష్మిక అల్లు అర్జున్ జంటగా నటించగా స్పెషల్ సాంగ్ లో సమంత నటించి సందడి చేశారు. ఉ అంటావా మావా ఊ ఊ అంటావా మావ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక ఈ పాటకు సమంత అద్భుతమైన స్టెప్పులు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి.
ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా సమంత (Samantha) పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం పుష్ప 2సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇందులో కూడా సమంతనే చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా సమంత స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెను మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సందర్భంగా సమంత పుష్ప2 స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ.. మీరు అనుకున్నది జరగదని తాను ఎలాంటి స్పెషల్ సాంగ్ లో చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు.ఇలా సమంత ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదని చెప్పడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఈమె ఇతర సినిమాలు వెబ్ సిరీస్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!