Samantha: విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పై సామ్ కామెంట్లు విన్నారా.. ఏమైందంటే?

ఈ ఏడాది ఆగష్టు నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలలో జైలర్ మినహా మరే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా థియేటర్లలో విడుదలైన గాండీవధారి అర్జున సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. వరుణ్ తేజ్ ఈ సినిమా కథను ఎంతగానో నమ్మారు. ప్రవీణ్ సత్తారు గత సినిమా ది ఘోస్ట్ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా వరుణ్ తేజ్ ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.

ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమాలేవీ లేకపోవడంతో సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఖుషి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన పాటలు అంచనాలను పెంచేశాయి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మామూలుగా ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, (Samantha) సమంత మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉండనుందని తెలుస్తోంది. అయితే సమంత తాజాగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. సమంత విజయ్ దేవరకొండ సీక్రెట్స్ చెప్పేయడంతో పాటు విజయ్ దేవరకొండ గురించి ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయాలను పూర్తిస్థాయిలో మార్చేశారు.

విజయ్ దేవరకొండను అంతా రెబల్ అని అనుకుంటారని నేను కూడా అలానే అనుకునేదానినని అయితే సెట్స్ లో విజయ్ ను చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిందని సామ్ తెలిపారు. విజయ్ ప్రతిరోజూ జిమ్ చేస్తాడని అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తాడని చాలా క్రమశిక్షణగా ఉంటాడని ఆమె చెప్పుకొచ్చారు. విజయ్ కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానని సామ్ తెలిపారు.

విజయ్ చాలా సాఫ్ట్ అని పార్టీలకు వస్తే వైన్ గ్లాస్ పట్టుకుంటాడే తప్ప డ్రింక్ చేయడని ఆమె అన్నారు. ఈ ఏడాదే విజయ్ పెళ్లి జరుగుతుందని తనకు అనిపిస్తోందని సమంత తెలిపారు. విజయ్ క్యారెక్టర్ ను సామ్ రివీల్ చేయగా ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus