Samantha: మీకోసం హార్డ్ వర్క్ చేస్తున్నా… ఆరోగ్యంతో తిరిగి వస్తా!

సమంత ప్రస్తుతం తన అనారోగ్య సమస్యల కారణంగా తన కెరీర్ కు మంచి పీక్ స్టేజ్ లో ఉండగానే ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాదులో మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత హాజరై సందడి చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో సమంతా మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి పలు విషయాలు తెలియజేశారు. తాను అనారోగ్యానికి గురైన సమయంలో షూటింగ్లో కూడా పాల్గొనలేకపోయాను అయితే ఆ సమయంలో దర్శక నిర్మాతలు మిగతా చిత్ర బృందం మొత్తం నాకోసం చాలా ఓపికగా ఎదురు చూశారని తెలిపారు. నిర్మాతలు నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకోసం ఎదురుచూసినందుకు వారికి ఎంతో రుణపడి ఉన్నానని ఈ సందర్భంగా సమంత తెలియజేశారు.

అదేవిధంగా తాను ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నానని పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే మరో మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇలా సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చేస్తున్న ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో ప్రతి ఒక్క పాట ఎంతో అద్భుతంగా ఉందని అన్ని పాటలు తనకు చాలా బాగా నచ్చాయని తెలియజేశారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీ మీ అందరితోపాటు ఈ సినిమా చూడటం కోసం తాను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సమంత నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus