సమంత ఈ ఏడాది ‘శాకుంతలం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా విషయంలో సమంత .. భయంకరమైన ట్రోలింగ్ ను ఫేస్ చేసింది. ట్రోలింగ్ ఆమెకు కొత్త కాదు. సక్సెస్ లు ఆమెకు కొత్త కాదు. కాబట్టి.. ఆమె తొందరగానే లైట్ తీసుకుంది. అయితే ఆమె అనారోగ్యంతో సతమతమవుతూ కూడా ఆ సినిమాని కంప్లీట్ చేసింది. అందుకు ఆమెను ట్రోల్ చేయడం అనేది అందరినీ బాధపెట్టింది అని చెప్పొచ్చు.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రాన్ని కూడా కంప్లీట్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తోంది. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొన్నాళ్ళు ప్రసాంతకరమైన జీవితాన్ని గడపాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె కొత్త లుక్ లోకి మారిపోయింది .ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తూ యోగాసనాలు, జిమ్ లో వర్కౌట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో (Samantha) ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో ఆమె మేకప్ లేకుండా కనిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సేవలో కూడా ఆమె భాగమవుతూ వస్తోంది. మానసికంగా ప్రశాంతత కోసం ఆమె ఆ రకంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. సమంత లేటెస్ట్ లుక్ చూసి కొంతమంది నెటిజన్లు ‘ఏంటి సామ్ ఇలా అయిపోయావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతలా ఆమె మొహంలో ఛేంజ్ వచ్చింది అనుకోవాలి.