Samantha: ‘ఫ్యామిలీ మెన్’ దర్శకులు ఇచ్చిన సలహా..సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్..!

కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. అందువల్ల ఆమె హాస్పిటల్లోనే ఉండి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సమంత నటించిన ‘యశోద’ మూవీ నవంబర్ 11న విడుదల కావాల్సి ఉంది. సినిమా విడుదలకు 4 రోజులే టైం ఉన్న నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ కు వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమంత ప్రమోషన్స్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆమెకు సోకిన వ్యాధి వల్ల ఆమె ఎక్కువ సేపు నిలబడలేదు, కూర్చోలేదు.

పైగా మోకాళ్ళ నొప్పులు కూడా ఆమెకు అధికంగా ఉన్నాయి. కాబట్టి సమంత ప్రమోషన్స్ కు రావడం కష్టం. అయినప్పటికీ ఆమె ప్రమోషన్స్ కు రావడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా సమంత కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో సమంత మోహంలో మునుపటి కళ అయితే లేదు. ఆమె ముక్కు, మొహం మారిపోయాయి. ఈ ఫొటోలను షేర్ చేస్తూనే ఆమె కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘నా ఫ్రెండ్స్ రాజ్ అండ్ డీకేలు చెప్పినట్టుగా..

జీవితంలో ఏ రోజు ఏం జరిగినా, ఎంత దరిద్రంగా ఉన్నా.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి.. మన సత్తా ఏంటో చూపించాలి..! అదే మాటలు ఈ రోజు నేను పాటించాలి అనుకుంటున్నాను.అనుసరిస్తున్నాను.. యశోద ప్రమోషన్స్ కోసం వస్తున్నా’ అంటూ ఆమె పేర్కొంది. అయితే సమంత యశోద ప్రమోషన్స్ లో ఎలా పాల్గొనబోతుంది?

ఈ ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆమె టీం చెబుతున్న దాని ప్రకారం.. హాస్పిటల్ లో ఉండే సమంత వీడియో ఇంటర్వ్యూల్లో పాల్గొనబోతుంది అని వినికిడి. అంటే లాక్ డౌన్ లో చేసినట్టన్న మాట. ఏమైనా సినిమా ప్రమోషన్ కోసం సమంత తీసుకుంటున్న స్టెప్ కు అభినందించాల్సిందే.

1

2

3

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus