Samantha: కాంట్రవర్సీకు చెక్ పెట్టిన ఫ్యామిలీ మ్యాన్!

భారీ అంచనాల మధ్య ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కు మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. అయితే తమిళ జనాలు అభ్యంతరం పెట్టినట్లుగా ఈ సిరీస్ లో ఏమైనా వివాదాస్పద అంశాలు ఉన్నాయా..? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. సమంత చేసిన టెర్రరిస్ట్ పాత్ర చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆమె తమిళ ఎల్టీటీఈ సభ్యురాలి పాత్రను పోషించింది.

అయితే ట్రైలర్ లో ఆమె పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసినట్లుగా చూపించడంతో తమిళనాడు నుండి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి తమిళ ప్రజల హక్కుల కోసం పోరాడిన తమిళ టైగర్లను ఉగ్రవాదులుగా ఎలా చూపిస్తారంటూ తమిళ సంఘాలు మండిపడ్డాయి. దీంతో ఈ సిరీస్ ను నిషేదించాలని డిమాండ్ కూడా చేశాయి. ఈ క్రమంలో సిరీస్ లో తమిళ టైగర్లను చెడుగా చూపించారా అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి.

కానీ సిరీస్ లో అలాంటి అంశాలను టచ్ చేయలేదు. వాళ్ల బాధలను, కష్టాలని చర్చించే ప్రయత్నం చేశారు. వారి కోణంలో కథను చెప్పాలని చూశారు. అయితే ఈ సిరీస్ కల్పిత కథ అని చెప్పినప్పటికీ.. ఇందులో ఎల్టీటీఈ గురించి చూపించారు. సమంత ఎల్టీటీఈ సభ్యురాలిగానే కనిపించింది. కానీ తమిళ టైగర్ల పట్ల సానుభూతి ఉన్నట్లుగా చూపించారు కాబట్టి తమిళులు మన్నించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus