Samantha: సెకండ్ హ్యాండ్ ఐటెం.. సామ్ రియాక్షన్ ఇదే!

అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు అనౌన్స్ చేసి రెండు నెలలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. ఎంతో ప్రేమగా ఉండే వీరిద్దరూ అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీనిపై అటు చైతు కానీ ఇటు సమంత కానీ స్పందించింది లేదు. మూడేళ్ల తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతూ.. అక్టోబర్ 2న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అయితే ఈ విషయంలో చాలా మందిని సమంతను బ్లేమ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పటికీ కూడా కొందరు ఆమెని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ నెటిజన్ సమంతను.. విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటెం అంటూ దారుణంగా మాట్లాడాడు. జెంటిల్మెన్(నాగచైతన్య) అయిన వ్యక్తి నుంచి అప్పనంగా రూ.50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్ చేశాడు. ఈ కామెంట్ సమంత కంటపడింది. వెంటనే ఆమె రియాక్ట్ అవుతూ..

‘ఆ దేవుడు నిన్ను చల్లగా దీవించుగాక’ అంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. ప్రస్తుతం డీఎంఈకి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదని సమంతకు సపోర్ట్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది.

ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్నిముకుందన్ లాంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత చేతిలో ఓ బైలింగ్యువల్ సినిమా అలానే.. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus