భర్త సినిమాలో అతిథి పాత్ర చేస్తున్న సమంత

నాగచైతన్య – విక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘థ్యాంక్యూ’లో హీరోయిన్లు ఎంత మంది? ఏమో చిత్రబృందం నుండి అధికారిక సమాచారం రాలేదు కానీ… అనధికారిక సమాచారం ప్రకారం అయితే ఇద్దరో, ముగ్గురో. ఆ నటీమణులు ఎవరూ అనే విషయంలో చాలా రకాల వార్తలొస్తున్నాయి. సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుండీ హీరోయిన్ల విషయంలో కొత్త కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్లతోపాటు, మరో నాయిక కూడా సినిమాలో ఉండబోతోందట. అది చైతు… నిజ జీవిత నాయికట.

‘మనం’ తర్వాత చైతు… విక్రమ్‌ కె కుమార్‌ చేస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. ఇందులో చైతు.. కుర్రాడిగా, మధ్య వయస్కుడిగా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తాడనీ తెలుస్తోంది. ఆ మధ్య మహేష్‌ అభిమాని నేపథ్యంలో సీన్స్‌ షూట్‌ చేశారు కూడా. ఇందులో ఓ నాయికగా అవికా గోర్‌ ను తీసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. రెండో నాయికగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను అనుకుంటున్నారట. మూడో నాయిక ఉంటుందంటున్నారు కాబట్టి.. ఆ నాయిక సీనియర్‌ హీరోయిన్‌ అని సమాచారం.

దీని కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు పరిశీలించారని వార్తలొచ్చాయి. వీరందరూ కాకుండా మరో పాత్ర… అదీ అతిథి పాత్రకు సమంతను తీసుకున్నారట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ పాత్రకు సమంత అయితే సరిపోతుందని చిత్రబృందం భావించిందట. అయితే సమంతను పూర్తి స్థాయి పాత్రలో తీసుకుంటారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అతిథి పాత్రకే పరిమితం అయిపోతుందన్నమాట.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus