సమంత విక్టరీ సింబల్ వెనుక కారణం?

అక్కినేని వారి కోడలు సమంత సోషల్ మీడియాలో ఓ ఫోటో పంచుకుంది. అరుదుగా సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసే సమంత విక్టరీ సింబల్ అయిన రెండు వేళ్ళు చూపిస్తూ మేకప్ కూడా లేకుండా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో నవ్వులు చిందిస్తున్న ఆ పేస్ చూస్తుంటే ఏదో విశేషం ఉందన్న భావన కలుగుతుంది. కొందరైతే ఎప్పటిలాగే సమంత తల్లి కాబోతుంది అని అంచనా వేస్తున్నారు. కొన్నాళ్లుగా సమంత కొత్త చిత్రాలు ఏవి ఒప్పుకోవడం లేదు.

దీనితో సమంత మరియు చైతూ పిల్లలు కావాలని అనుకుంటున్నారు అని ఒక వాదన వినిపిస్తుంది. ఆ విక్టరీ సింబల్ ఫోటోతో పాటు ఏదైనా సందేశం రాసి ఉంటే అందరికి ఈజీగా అర్థం అయ్యేది. మరి సమంత పోస్ట్ వెనుక అసలు కారణం ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడక తప్పేలా లేదు. గతంలో కూడా సమంత గర్భవతి అంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి. అప్పుడే ఆ పుకార్లను ఖండించిన సమంత అందులో ఎటువంటి నిజం లేదని తెల్చిపారేసింది.

సమంత మరియు నాగ చైతన్య ప్రస్తుతం సమానంగా 33 ఏళ్ళ వయసులో ఉన్నారు. మరి సాధారణ ప్రజల వలె అయితే పిల్లల విషయంలో వీరు లేటైనట్లే. అయితే సెలెబ్రిటీలు కాబట్టి కెరీర్ ముందు తరువాత పెళ్లి, పిల్లలు అనే ధోరణి ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మాత్రం నాలుగవ తరం వారసుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus