Sammathame Collections: మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘సమ్మతమే’ కలెక్షన్లు..!

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’.’యుజి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కనకాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ , టీజర్, ట్రైలర్ వంటివి ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.నిన్న అంటే జూన్ 24న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.తొలిరోజు ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే విధంగా ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

ఒకసారి ‘సమ్మతమే’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.28 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.76 cr

‘సమ్మతమే’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే కొన్ని ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.76 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వీకెండ్ ఇంకా బాగా పికప్ అయ్యి రాణిస్తే ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ షోలు, మ్యాట్నీల అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. ఈవెనింగ్ షోలకి గ్రోత్ ను చూపిస్తుందేమో చూడాలి..!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.