Sampath Raj: ఆమె నా ఫ్రెండ్‌… పుకార్లకు మరోసారి ఫుల్‌స్టాప్‌!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్నా… ‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్‌ విలన్‌గా మారిపోయారు సంపత్‌ రాజ్‌. ఆ సినిమాతో… పాత సినిమాలు చూసినప్పుడు ఈయన సంపత్‌ రాజ్‌నే కదా అని అనుకోవడం మొదలుపెట్టారు. ఆ సినిమాలో సంపత్‌కి ఎంత పేరొచ్చిందంటే… ఆ తర్వాత ఓ సారి శంషాబాద్‌ విమానాశ్రంలో ఫ్యాన్స్‌ కొందరు చూసి… ‘మా వాడు మా వాడు’ అంటూ తెగ మెచ్చేసుకున్నారట. ఆ ప్రేమను చూసి సంపత్‌ ‘వామ్మో’ అనుకున్నారట. ఇలా సంపత్ చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

ఓ టీవీ ఛానల్‌లో ప్రముఖ నటుడు నిర్వహిస్తున్న టాక్‌ షోలో ఈ విషయాలన్నీ వచ్చాయి. దీంతోపాటు నటి శరణ్యతో తన అనుబంధం గురించి కూడా చెప్పారు సంపత్‌. మేం ఒక సినిమాలో భార్యాభర్తలుగా నటించామని, అయితే ఎవరో ఒకాయన తమను భార్యాభర్తలు అంటూ వార్తలు రాసేశాడని వివరించారు సంపత్‌రాజ్‌. దాంతో తన తండ్రి పోలీసు అని.. తన తల్లీదండ్రులు తొలిసారి ఎలా కలిసింది కూడా వివరించారు సంపత్‌. ఇంట్లో ఏడుగురు పిల్లలమని, తాను ఎప్పుడు మమ్మల్ని వారం పేర్లతో పెట్టి పిలవొచ్చుగా అని అంటుంటానని, అలా తను ఆఖరివాడు కాబట్టి…

తన పేరు ఆదివారం అని చెప్పాడు. దీంతోపాటు త్రివిక్రమ్‌ గురించి కూడా మాట్లాడారు సంపత్‌. నెక్స్ట్‌ సినిమాలో తనకు అవకాశం ఇవ్వకపోతే సెట్‌కొచ్చి కెమెరా ఎత్తుకుపోతానని చెప్పానని కూడా నవ్వుతూ అన్నాడు సంపత్‌. త్వరలో ఓ సినిమా స్టార్ట్‌ అవుతుందని తెలిసిందని, ఆ సినిమాలో అవకాశం ఇవ్వకపోతే కెమెరా ఎత్తుకెళ్లిపోవడమే అన్నారు. త్రివిక్రమ్‌ ఎక్కడుంటారో తనకు సునీల్‌ చెప్పాడని, ఈసారి పక్కా అని సరదాగా చెప్పుకొచ్చారు సంపత్‌. దీంతోపాటు చదువులో తాను చాలా పూర్‌ అని, అందుకే తన తల్లి ఎప్పుడూ చదువు రానివాళ్లు సినిమాల్లోకి వెళ్లిపోతారు అని అనేదని కూడా వివరించారు సంపత్‌.

తన తండ్రి అయితే… నువ్వు ఇంటి నుండి పారిపో లేకపోతే మీ అమ్మతో నీకు అవ్వదు చెప్పేసేవారట. ఇక సంపత్‌ డ్యాన్స్‌ కూడా అదరగొట్టేశారు. మరేంటి నెక్స్ట్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేసేస్తారా అంటే… నేను రెడీ ఎవరైనా అవకాశం ఇస్తే చేసేస్తా అని కూడా అన్నారు. అదన్నమాట మేటర్‌. మరిన్ని డీటైల్స్‌ సోమవారం తెలుస్తాయి. ఎందుకంటే ఆ రోజే ఫుల్‌ ఎపిసోడ్‌ టెలీకాస్ట్‌.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus