సంయుక్త మీనన్ (Samyuktha Menon) అందరికీ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో (Bheemla Nayak).. రానా (Rana Daggubati ) భార్య పాత్రలో కనిపించింది. సినిమా క్లైమాక్స్ ను మలుపు తిప్పేది ఈ పాత్ర. సినిమా విజయంలో కూడా సంయుక్తది కీలక పాత్ర. ఇంకా చెప్పాలంటే మెయిన్ హీరోయిన్ నిత్యా మీనన్ కంటే ఎక్కువ అని చెప్పాలి. అందుకే ఆ సినిమాకి గాని సంయుక్తకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి.
‘బింబిసార'(Bimbisara), సార్ (Sir), విరూపాక్ష (Virupaksha) వంటి క్రేజీ సినిమాల్లో కూడా నటించింది. అవి కూడా హిట్ అవ్వడంతో ఈమె స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘డెవిల్’ (Devil) సినిమా ఈమెకు షాకిచ్చింది. ఆ తర్వాత ఈమె హవా తగ్గింది. ఇంకో రకంగా చెప్పాలంటే అవకాశాలు కూడా తగ్గాయి. ప్రస్తుతం ‘స్వయంభు'(Swayambhu) ‘అఖండ 2’ వంటి సినిమాల్లో నటిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఈమె ఎంపికయ్యింది.
అయితే ఇంతలో ఈమె ఓ స్టార్ హీరో సరసన ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో సూర్య (Suriya) హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) దీనికి దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని (Bhagyashree Borse) తీసుకున్నట్లు టాక్ నడిచింది. ‘సితార’ బ్యానర్లో ఈమె మరో సినిమాకి సైన్ కూడా చేసింది. ఇంతలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా.. సూర్యకి జోడీగా సంయుక్త మీనన్ ని తీసుకున్నట్లు ప్రచారం చేస్తుండటం గమనార్హం.
సూర్య వంటి స్టార్ హీరో పక్కన సంయుక్త మీనన్ వంటి మిడ్ రేంజ్ హీరోయిన్ ని ఎలా తీసుకుంటారు. ఒకవేళ ఆమెను ఈ సినిమా కోసం తీసుకున్నా.. వేరే పాత్రకి అయ్యి ఉండొచ్చు. మెయిన్ హీరోయిన్ గా ఆమెను తీసుకునే అవకాశాలు ఇప్పుడు లేవు. మరి ఎవరు మెయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు అనేది చిత్ర బృందం అధికారిక ప్రకటన ద్వారా తెలపాల్సి ఉంది.