‘స్పిరిట్’ కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ‘యానిమల్’ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో ‘స్పిరిట్’ రూపొందనున్నట్టు 2021 లోనే అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ ప్రభాస్ కమిట్మెంట్స్ వల్ల… డిలే అవుతూ వచ్చింది ‘స్పిరిట్’.
ఈ సినిమాలో కెరీర్లో మొదటి సారి పోలీస్ డ్రెస్ వేయబోతున్నాడు ప్రభాస్. ఓ యాంగ్రీ కాప్ గా ప్రభాస్ కనిపించనున్నాడు. అలాగే విదేశీ నటుడు డాన్లీ కూడా ‘స్పిరిట్’ లో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగా కూడా పరోక్షంగా ఈ విషయంపై స్పందించడం జరిగింది.

ఇదిలా ఉంటే.. ‘స్పిరిట్’ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? అనే ప్రశ్న అందరిలోనూ మిగిలే ఉంది. ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం స్పెషల్ లుక్ మెయింటైన్ చేయాల్సి ఉంది. అందుకే బల్క్ డేట్స్ అడిగాడు సందీప్. అతను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. తన కథకు న్యాయం జరగాలి అనే ఆలోచిస్తాడు. దీపికా పదుకోనె వంటి స్టార్ హీరోయిన్..నే ‘స్పిరిట్’ ప్రాజెక్టు నుండి తీసేసి త్రిప్తి దిమిరి వంటి అప్ కమింగ్ హీరోయిన్ ను మెయిన్ లీడ్ గా పెట్టాడు అంటే.. సందీప్ క్లారిటీ అర్ధం చేసుకోవచ్చు.
అందుకే ప్రభాస్ కమిట్మెంట్స్ పూర్తయ్యాకే స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అని డిసైడ్ అయ్యాడు. ఫైనల్ గా దానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నవంబర్ ఎండింగ్ నుండి ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సందీప్ రివీల్ చేశాడు. ఈరోజు అతను ‘జిగ్రీస్’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చాడు. అక్కడ ఈ విషయాన్ని రివీల్ చేశాడు. సందీప్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది అనే చెప్పాలి.
