Sandeep Reddy Vanga: అమ్మే నా ఎమోషనల్ సపోర్ట్!: సందీప్ రెడ్డి

Ad not loaded.

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రి సెన్సేషనల్ డైరెక్టర్ గా మారినటువంటి సందీప్ రెడ్డివంగా త్వరలోనే యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృందం కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు .

ఇకపోతే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక యాంకర్ ప్రశ్నిస్తూ ఎన్నో ఎమోషనల్ సినిమాలను చేసే మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఒకప్పుడు తన అమ్మ తనకు ఎమోషనల్ సపోర్ట్ అని తెలియజేశారు.

2019వ సంవత్సరంలో అమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయారని ఈయన తెలియజేశారు అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనటువంటి రెండు నెలల తరువాత తన తల్లికి క్యాన్సర్ ఉందనే విషయం బయటపడిందని అయితే అమ్మకు చికిత్స చేయించిన చనిపోయారని ఈయన తెలియజేశారు. అమ్మ మరణించడంతో నా జీవితం కూడా అయిపోయిందని అనుకున్నాను.

ఎందుకంటే మరణానికి సంబంధించిన ఎమోషన్స్ నన్ను భయపెట్టేవని అందుకే నా స్నేహితుల సర్కిల్లో ఎవరు చనిపోయిన నేను వెళ్లేవాడిని కాదు అని ఈయన తెలియజేశారు అయితే చనిపోయిన మూడు రోజుల తర్వాత వారిని ఓదార్చడానికి తాను వెళ్తాను కానీ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు మాత్రం వెళ్లనని ఈ సందర్భంగా ఈయన (Sandeep Reddy Vanga) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus