టెన్నిస్ తార సానియా మీర్జా 2వ పెళ్లి చేసుకోబోతోందా? అంటే అవుననే కథనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అవి అపోహలే అని తేలింది. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ హీరోతో డేటింగ్లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఆ హీరోని సానియా పెళ్లాడబోతుంది అని కూడా అంటున్నారు.
అయితే ఆ హీరో ఎవరు? అతనితో సానియాకి ఎలా పరిచయం ఏర్పడింది? ఎప్పుడు పెళ్లాడబోతున్నారు? ప్రస్తుతానికి వీటిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు.. సానియా సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడపడుతున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఏ హీరోతో సన్నిహితంగా ఉందా అని చెక్ చేస్తున్నారు..!
2010 లో సానియా… పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్ళాడిన సంగతి తెలిసిందే. ఓ దశలో ‘మాలిక్- సానియా..లది సూపర్ పెయిర్’ అంటూ ప్రశంసించారు. ఈ దంపతులకి ఓ బాబు కూడా ఉన్నాడు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్. 2021 వరకు ఈ జంట బాగానే కలిసుంది.
కానీ ఆ తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్తాన్ సినీ నటి సనా జావేద్.. తో ఎఫైర్ పెట్టుకున్నట్లు కథనాలు వినిపించాయి. సానియాతో విడాకులు ఇచ్చిన వెంటనే ఆమెను 3వ పెళ్లి చేసుకున్నాడు షోయబ్. సో ఆమె వల్లే సానియా- షోయబ్..ల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు అంతా అనుకున్నారు.