బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కేజీఎఫ్2’ సినిమాలో కనిపించారు సంజయ్ దత్. అధీరా పాత్రలో అతడి నటన ఓ రేంజ్ లో ఉంది. విలన్ రోల్ లో పరకాయ ప్రవేశం చేశారు సంజయ్ దత్. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు సంజయ్ దత్.
ఈ సందర్భంగా సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటు అయిందనే విషయాన్ని సైతం షేర్ చేసుకున్నారు. అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడానికి డ్రగ్స్ అలవాటు చేసుకున్నానని సంజయ్ దత్ చెప్పారు.
‘అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాను. కానీ ఈ ప్రాసెస్ లో డ్రగ్స్ కి బానిసై ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చారు.
అందరికీ దూరంగా ఉంటూ.. ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడినని చెప్పారు. తన జీవితంలో ఆ పదేళ్లు రూమ్ లో లేదా బాత్రూమ్ లో గడిపేవాడినని.. షూటింగ్ లపై ఆసక్తి ఉండేది కాదని.. అయితే డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపానని చెప్పారు. తిరిగివచ్చాక అందరూ తనను డ్రగ్గీ అని పిలిచేవారని.. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కష్టపడి బాడీని బిల్డ్ చేయడంతో.. అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’ అంటూ ప్రశంసించారని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!