‘జాక్’, ‘కుబేర’, ‘పెద్ది’, ‘డకాయిట్’.. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా దెబ్బకు టైటిల్స్ అన్నీ చాలా షార్ట్ అండ్ పంచిగా మారుతున్నాయి. కానీ, 2026 సంక్రాంతి ట్రెండ్ మాత్రం పూర్తిగా రివర్స్‌లో వెళ్తోంది. ఈసారి మేకర్స్ “టైటిల్” బదులు, పోస్టర్‌పై ఒక “పారాగ్రాఫ్” రాస్తున్నారనే రేంజ్‌లో పొడువాటి పేర్లను ఎంచుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీసింది.
Tollywood
ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దీని వెనుక పక్కా స్ట్రాటజీ కనిపిస్తోంది. ఈ టైటిల్స్ చదవడానికే ప్రేక్షకులకు టైమ్ పడుతున్నా, ఇందులో ఒక కొత్త కిక్ కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో మొదటగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి సినిమానే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ క్యామియోతో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే భారీ టైటిల్ పెట్టారు.
ఇది చదవడానికే రెండు సెకన్లు పడుతోంది. సినిమాలోని భారీ స్టార్ కాస్టింగ్‌కు, ఫ్యామిలీ ఫీల్‌కు తగ్గట్టే, ఈ టైటిల్ కూడా అంతే నిండుగా, ఒకప్పటి తెలుగు సినిమా సంప్రదాయాన్ని గుర్తుచేస్తోంది. ఈ పరుగు మెగాస్టార్‌తో ఆగలేదు. యంగ్ హీరోలు కూడా ఇదే దారి పట్టారు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో జనవరి 14న వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్‌కు ‘అనగనగా ఒక రాజు’ అని పేరు పెట్టారు.
అలాగే, వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజ, ఈసారి కిషోర్ తిరుమలతో వస్తున్న సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే క్లాస్ టైటిల్‌తో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఈ టైటిల్స్ అన్నీ పక్కా తెలుగు ఫీల్‌ను ఇస్తున్నాయి. అసలు ఈ పొడువాటి టైటిళ్ల ట్రెండ్ ఎక్కడ మొదలైంది? అని ఆరా తీస్తే, అందరి వేళ్లూ ఒక్క సినిమావైపే చూపిస్తున్నాయి.
అదే, గతేడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఆ టైటిల్ తెచ్చిన పాజిటివ్ వైబ్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం.. బహుశా ఈ సంక్రాంతి మేకర్స్‌ను బాగా ప్రభావితం చేసినట్లుంది. అందుకే ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతూ, పండగకు తగ్గ పేర్లను వెతుకుతున్నారు.
పాన్ ఇండియా మోజులో పడి, అందరూ తమ టైటిల్స్‌ను షార్ట్‌గా మారుస్తున్న టైమ్‌లో, సంక్రాంతి సినిమాలు మాత్రం తిరిగి పాత తెలుగు మూలాల్లోకి వెళ్తున్నాయి. ఈ పొడువాటి టైటిల్స్, ప్రేక్షకులకు ఇది పక్కా తెలుగు పండగ సినిమా అనే నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఇది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడమే కాదు, పండగ సీజన్‌కు కావాల్సిన ఆ ‘తెలుగు ఫీల్’ను కూడా బలంగా క్యారీ చేస్తున్నాయి.
