విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ..ల కలయికలో ‘ఎఫ్ 2’(F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి హిట్ల తర్వాత వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) . సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం… ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం క్యూ కట్టడం జరిగింది. ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ బడ్జెట్ సినిమా, ‘డాకు మహారాజ్’ వంటి మాస్ సినిమా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకే ఓటేశారు.
అలా హౌస్ ఫుల్ బోర్డులతో ఈ సినిమా థియేటర్లు అన్నీ కళకళలాడాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు కూడా డీసెంట్ షేర్స్ రాబడుతూ వచ్చింది ఈ సినిమా. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 42.39 cr |
సీడెడ్ | 18.82 cr |
ఉత్తరాంధ్ర | 21.38 cr |
ఈస్ట్ | 13.68 cr |
వెస్ట్ | 9.00 cr |
కృష్ణా | 9.57 cr |
గుంటూరు | 10.26 cr |
నెల్లూరు | 4.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 129.88 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 8.92 cr |
ఓవర్సీస్ | 16.50 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 155.30 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో ఏకంగా రూ.155.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.114.3 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. గ్రాస్ పరంగా రూ.271.6 కోట్లు కొల్లగొట్టింది.