Sarayu Remunertion: సరయు పారితోషికం ఎంతో మీకు తెలుసా?
- September 14, 2021 / 04:14 PM ISTByFilmy Focus
బిగ్ బాస్ సీజన్5 తెలుగులో తొలి వారం సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సరయును ఎలిమినేట్ చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హమీదాకు బదులుగా సరయును ఎలిమినేట్ చేశారని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సరయు హౌస్ లో చాలామంది ముసుగులు వేసుకుని ఆడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సరయు రెమ్యునరేషన్ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ షో ద్వారా సరయుకు 70వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పారితోషికం దక్కినట్టు సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు సరయుకు తక్కువ మొత్తమే పారితోషికంగా ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరయు తొలి వారమే ఎలిమినేట్ కావడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరికొన్ని వారాలు సరయు హౌస్ లో కొనసాగి ఉంటే తనను తాను నిరూపించుకుని ఉండేదని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీజే సన్నీ తనపై పగ పెంచుకున్నాడని, సిరి మగవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతోందని సరయు చెప్పుకొచ్చారు.

కంటెస్టెంట్ల గురించి సరయు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ లవ్ ట్రాకుల కోసం సరయును బలి చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. రవి, షణ్ముఖ్ లలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువారం రోజున బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్, తొలివారం వీక్ డేస్ ఎపిసోడ్లకు సంబంధించిన రేటింగ్ వివరాలు తెలియనున్నాయి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!














