మాములుగా తెలుగు ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక సంచలనం.ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు.తాజాగా మరో సంచలనానికి పవన్ కళ్యాణ్ సినిమా తెరలేపింది.పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ‘గబ్బర్ సింగ్’ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాత అటకెక్కి కూర్చున్నా బయ్యర్లు మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా ఆ సినిమాను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.రేటు ఎంత అయినా సరే ఆ సినిమాను మాత్రం దక్కించుకోవాలి అనుకుంటున్నారు.బాహుబలి సినిమాను పక్కనపెడితే థియేటర్స్ విషయం లో మాత్రం ఈ సినిమా మోత మోగిస్తుంది.
ఆంధ్రా లో చిన్న జిల్లాలైన వైజాగ్ లో రూ 7 కోట్లు తో మోత మోగించగా,మరో చిన్న జిల్లా నెల్లూరు లో రూ 3 కోట్ల రూపాయలు పలికి బయ్యర్లందరికి దిమ్మతిరిగేల చేసింది.ఈ రెండు జిల్లాల్లోనే ఇంత రేటు పలకడమంటే మాములు విషయం కాదు.ఇక నైజాం లో కూడా ఈ సినిమా బయ్యర్లకు చుక్కలు చూపిస్తుంది. ఇంద్ర ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను నైజాం ఏరియాకు రూ.20 కోట్లకు కొన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే ఓవర్సీస్ సహా అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసి.. అతి పెద్ద మార్కెట్ ఉన్న నైజాం ఏరియా వరకు శరత్ మరార్, ఈరోస్ ప్రతినిధులు బేరం తెంచకుండా ఉంచారు. మొన్నే ఏప్రిల్ 8న రిలీజ్ పక్కా అంటూ ప్రకటన ఇచ్చి.. నైజాం ఏరియాకు కూడా బిజినెస్ ఓపెన్ చేశారు. దిల్ రాజు, అభిషేక్ లాంటి వాళ్లను పక్కకు నెట్టి ఇంద్ర ఫిలిమ్స్ సంస్థ రికార్డు స్థాయిలో రూ.20 కోట్లకు సినిమాను పట్టేసినట్లు తెలిసిందే. ఇప్పటిదాకా బాహుబలి మాత్రమే నైజాంలో రూ.20 కోట్ల బిజినెస్ మార్కును చేరుకుంది.దిల్ రాజు దాన్ని 24 కోట్లుకు కొన్నాడు,బాహుబలి రేంజ్ వేరు కాబట్టి దాన్ని పక్కనపెడితే తరవాతి సినిమాలలో శ్రీమంతుడు 15 కోట్లతో అగ్రస్థానం లో ఉండగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దాన్ని దాటేసింది.