Saripodhaa Sanivaaram Collections: ‘సరిపోదా శనివారం’ 6 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

నాని (Nani)  – వివేక్ ఆత్రేయ  (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్  (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య  (SJ Suryah)  పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.

Saripodhaa Sanivaaram Collections

దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.వర్షాల వల్ల అనుకున్న రేంజ్లో కాకపోయినా.. మొత్తంగా చాలా బెటర్ అనిపించాయి అని చెప్పాలి.మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది.6వ రోజు కూడా డీసెంట్ గానే కలెక్ట్ చేశాయి. ఒకసారి (Saripodhaa Sanivaaram Collections) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 10.12 cr
సీడెడ్ 2.95 cr
ఉత్తరాంధ్ర 2.70 cr
ఈస్ట్ 1.17 cr
వెస్ట్ 0.92 cr
గుంటూరు 1.29 cr
కృష్ణా 1.31 cr
నెల్లూరు 0.84 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 21.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.10 Cr
  ఓవర్సీస్ 10.20 Cr
మిగిలిన భాషలు 0.90 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 35.50 cr

‘సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.35.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus