Saripodhaa Sanivaaram Collections: డీసెంట్ హిట్ గా నిలిచిన ‘సరిపోదా శనివారం’ .. ?
- November 2, 2024 / 05:22 AM ISTByFilmy Focus
నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) వంటి క్లాస్ మూవీ తర్వాత వచ్చిన మాస్ మూవీ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Mohan) హీరోయిన్ కాగా ఎస్.జె.సూర్య (SJ Suryah) విలన్ గా చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ అయ్యింది. నిడివి విషయంలో కొంచెం కంప్లైంట్స్ వినిపించినా ఫైనల్ గా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.
Saripodhaa Sanivaaram Collections:

ఈ సినిమా రిలీజ్ టైంకి ఆంధ్రాలో భారీ వర్షాలు కురవడంతో భారీ కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది కానీ.. మొత్తం మీద బ్రేక్ ఈవెన్ సాధించి నానికి ఇంకో హ్యాట్రిక్ ను కట్టబెట్టింది. ఒకసారి (Saripodhaa Sanivaaram) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 13.60 cr |
| సీడెడ్ | 3.57 cr |
| ఉత్తరాంధ్ర | 3.75 cr |
| ఈస్ట్ | 1.72 cr |
| వెస్ట్ | 1.35 cr |
| గుంటూరు | 1.76 cr |
| కృష్ణా | 1.81 cr |
| నెల్లూరు | 1.15 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 28.71 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.72 Cr |
| ఓవర్సీస్ | 11.95 Cr |
| మిగిలిన భాషలు | 1.42 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 45.80 cr |
‘సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.45.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.80 కోట్ల షేర్ ను బయ్యర్స్ కి అందించి డీసెంట్ గా హిట్ గా నిలిచింది.














