ఒక సినిమా రిలీజ్ అయితే హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేకంటే ఎక్కడ ఎవడు పైరసీ రిలీజ్ చేస్తాడా అనే భయం ప్రతి ఇండస్ట్రీ లోను ఉంది. ఈ పైరసీ భూతం పైన అన్ని సినీ ఇండస్ట్రీ లు ఇప్పటికి గట్టిగ ఫైట్ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఇక మనతో పోలిస్తే తమిళ ఇండస్ట్రీ లో పైరసీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ పేరే కనిపిస్తుంది. అన్ని వెబ్ సైట్స్ ని పైరసీ విషయంలో చాలా కంట్రోల్ చేయగలుగుతున్నారని కానీ తమిళ్ రాకర్స్ ని మాత్రం ఏం చేయలేని పరిస్థితి ఇండస్ట్రీ లో ఉంది.
ఇక విషయంలోకి వెళితే, విజయ్ హీరోగా, మురగదాస్ డైరెక్షన్ లో సర్కార్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. అయితే తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ ఈ మూవీ ని రిలీజ్ కి ఒక గంట ముందే ఆన్ లైన్ లో పెట్టేస్తాం అంటూ గట్టి సవాల్ విసిరింది. ఈ విషయం పైన తీవ్ర ఆందోళన చెందిన నిర్మాత థియేటర్ లో సినిమా పైరసీ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ చర్చలు జరిపారు అంటా. ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసిన తమిళ రాకర్స్ ని మాత్రం ఇప్పటికి ఏం చేయలేకపోతుండటం విచారించదగ్గ విషయమే.