మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదల కాబోతుంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి,టీజర్ బాగుంది, ట్రైలర్ కూడా బాగుంది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది ఈ సినిమా. అయినప్పటికీ మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం | 35.30 cr |
సీడెడ్ | 13.50 cr |
ఉత్తరాంధ్ర | 13.00 cr |
ఈస్ట్ | 8.50 cr |
వెస్ట్ | 2.20 cr |
గుంటూరు | 9.00 cr |
కృష్ణా | 7.35 cr |
నెల్లూరు | 4.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 98.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.00 cr |
ఓవర్సీస్ | 11.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 120.00 cr |
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగిన మూవీ ఇది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. హిట్ టాక్ వస్తేనే తప్ప అంత టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీ అయితే కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ జస్ట్ ఓకె అనే విధంగా ఉన్నాయి తప్ప.. రికార్డులు కొట్టేంతలా అయితే లేవనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి..!
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!