Sarkaru Vaari Paata Collections: 10 వ రోజున కూడా డీసెంట్ అనిపించిన ‘సర్కారు వారి పాట’..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వారం మంచి కలెక్షన్లను సాధించాయి. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.

రెండో వీకెండ్ కూడా ఈ మూవీ బాగానే పెర్ఫామ్ చేసింది.’సర్కారు వారి పాట’ 10 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 32.81 cr
సీడెడ్ 11.16 cr
ఉత్తరాంధ్ర 11.32 cr
ఈస్ట్  8.34 cr
వెస్ట్  5.18 cr
గుంటూరు  8.34 cr
కృష్ణా  5.85 cr
నెల్లూరు  3.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 86.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   6.08 cr
ఓవర్సీస్  11.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 104.35 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.104.35 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మాములు విషయం కాదు. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.16.65 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు. అది సాధ్యమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.