మహేష్ బాబు గతంలో సేఫ్ గేమ్ ఆడింది లేదు. కానీ ఇప్పుడు తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి తాను ఏ సినిమా చేసినా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ప్రయోగాల జోలికి అతను పోవడం లేదు. ‘1 నేనొక్కడినే’ వంటి ప్రయోగాత్మక మూవీ చేసినా మహేష్ కు హిట్ ఇచ్చింది ‘శ్రీమంతుడు’ తోనే..! మళ్ళీ ‘స్పైడర్’ వంటి ఆఫ్ బీట్ మూవీ చేసినా.. సక్సెస్ అందించింది ‘భరత్ అనే నేను’ మూవీ మాత్రమే. మహేష్ ను ఓ కంప్లీట్ కమర్షియల్ హీరోగా చూడడానికే ఇప్పటి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.
అందుకోసమే ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు అలానే మంచి మెసేజ్ ఉండేలా కూడా జాగ్రత్త పడుతున్నాడు. సరిగ్గా ఇప్పుడు ‘సర్కారు వారు పాట’ మూవీలో కూడా అదే విధమైన కమర్షియల్ అంశాలు ఉంటాయని సమాచారం. సినిమా ప్రధమార్ధం అంతా ఎంటర్టైన్మెంట్ తో సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మంచి మెసేజ్ ఉంటుందట. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆర్ధిక వ్యవస్థ గురించి సామాన్య జనాల తీరు గురించి 5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా క్లాస్ పీకుతాడట మహేష్.
అంటే ‘బిజినెస్ మెన్’ మూవీ స్టైల్లో అన్న మాట. నిజానికి ఆ సినిమాకి.. చివర్లో మహేష్ చెప్పే ఫిలాసఫీకి సంబంధం ఉండదు. కానీ ఆ డైలాగులు బాగా పేలాయి. ఇప్పుడు దర్శకుడు పరశురామ్ పెట్ల కూడా మహేష్ తో ఆ రేంజ్లో స్పీచ్ లు ఇప్పిస్తాడని తెలుస్తుంది.