Sarkaru Vaari Paata First Review: ‘సర్కారు వారి పాట’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరించాడు. పాటలు, ట్రైలర్ వంటివి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేశాయని చెప్పొచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్ సంగీత దర్శకుడు.

సముద్ర ఖని విలన్ గా నటించగా నదియా కీలక పాత్ర పోషించింది. మే 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ బయటకి వచ్చింది. ప్రముఖ సెన్సార్ సభ్యులు, విశ్లేషకుడు అయిన ఉమర్ సంధు ‘సర్కారు వారి పాట’ ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించాడు.

మహేష్ బాబు ఎంట్రీ సీన్ అదిరిపోయిందట.

ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా సాగిందట.

మహేష్ బాబు లుక్స్, డ్రెసింగ్ స్టైల్ చాల బాగున్నాయని చెప్పుకొచ్చాడు.

2022 కి ఇది తన ఫేవరెట్ ఫిలిం అంటూ ఉమర్ సంధు తెలిపాడు.

మహేష్ బాబు మంచి ఫామ్లో ఉన్నాడని, నిర్మాతగా కూడా అతను మంచి కంటెంట్ ఉన్న కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడని… ‘సర్కారు వారి పాట’ ‘మేజర్’ సినిమాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రానికి ఫుల్ మర్క్స్ మహేష్ కే పడతాయని, ఈ మూవీకి అతను ఒక పవర్ అంటూ చెప్పుకొచ్చి ఏకంగా 5 కి 4.5 రేటింగ్ ఇచ్చేసాడు.

ఉమర్ రివ్యూల గురించి తెలిసిన వాళ్ళు దీనిని పెద్దగా పట్టించుకోరు, గతంలో ఇతను ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ లకి కూడా భీభత్సమైన రేటింగ్ లు ఇచ్చాడు. వాటి ఫలితాలు ఏంటి అన్నది తెలుసు కాబట్టి ఫ్యాన్స్ ఇతని రివ్యూని పట్టించుకోరు. కానీ నిజంగా ఇలా ఉంటే బాగుణ్ణు అని ఆశపడుతుంటారు.

1

2

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus