మహేష్ ప్లాన్ మామూలుగా లేదు
- December 30, 2020 / 05:26 PM ISTByFilmy Focus
మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆ ప్రాజెక్టును రిలీజ్ చేయాలని అనుకుంటాడు. చాలా వరకు దర్శకులకు నిర్మాతలకు సపోర్ట్ చేస్తూ ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేస్తుంటాడు. ఒక్కసారి షూటింగ్ మొదలైతే మహేష్ కారణంగా ఆగిపోయిన సందర్భాలు లేవు. కథకు ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూడా ఆ తరువాత దర్శకుల మాటకు అడ్డు చెప్పడు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట రిలీజ్ విషయంలో కూడా మహేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది సంక్రాంతికి ఒక సినిమాతో రావాలని అనుకున్న మహేష్.. కరోనా లాక్ డౌన్ వల్ల అనుకున్నట్లుగా ప్లాన్ చేయలేకపోయాడు. ఇక వచ్చే ఆగస్ట్ లో సర్కారు వారి పాటను రిలీజ్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. 2020 ఆగస్ట్ 15లోపే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ మొత్తం ఇటీవల ఒక షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ ను

జనవరి చివరలో మొదలు పెట్టి జూన్, జులై నాటికి షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయాలని మెంటల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

















