Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ వెనుక ఆసక్తికర విషయం!

మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా మొదలైంది చాలు… లీక్‌ల పర్వం కొనసాగుతోంది. సినిమా ముహూర్తం డేట్‌ నుండి మొన్నీ మధ్య వచ్చిన ట్రైలర్‌ గ్లింప్స్‌ వరకు అన్నీ లీక్‌ అవుతూనే ఉన్నాయి. ఎందుకు, ఎక్కడి నుండి లీక్‌ అవుతున్నాయి అని చిత్రబృందం ఎంత శోధించినా ఫలితం అయితే ఉండటం లేదు. ఎందుకంటే లీక్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ లీక్‌ల గురించి మహేష్‌బాబు మాట్లాడారు. తన సినిమా టైటిల్‌ తనకు కనీసం తెలియకుండానే లీక్‌ అయిపోయిందని చెప్పాడు మహేష్‌.

మహేష్‌బాబు కథ చెప్పేశాక.. ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసే సమయంలో టైటిల్‌ ఏం పెడితే బాగుంటుంది అని దర్శకుడు పరశురామ్‌ అనుకున్నారట. అలా అనుకుని ‘సర్కారువారి పాట’ అనే పేరు అయితే బాగుంటుందని ఫిక్స్‌ అయిపోయారట. అయితే ఆ టైటిల్‌ గురించి చర్చ ఎక్కడా మహేష్‌ – పరశురామ్‌ మధ్య జరగలేదు. కానీ ఓ మహేష్‌ జిమ్‌లో ఉన్నప్పుడు నమ్రత వచ్చి ‘మన కొత్త సినిమా టైటిల్‌ లీక్‌ అయిపోయిందట. యూఎస్‌ వాళ్లకి అప్పుడే తెలిసిపోయిందట’ అని చెప్పారట.

దీంతో షాక్‌ తినడం మహేష్‌బాబు వంతు అయ్యిందట. కారణం అప్పటివరకు ఆయనకు కూడా ఆ సినిమా టైటిల్‌ తెలియకపోవడమే. లీక్‌ విషయం తెలుసుకున్న వెంటనే పరశురామ్‌కి మహేష్‌బాబు ఫోన్‌ చేసి.. ‘ఏంటి సర్‌ టైటిల్‌ లీక్‌ అయ్యిందట? ఇంతకీ ఏమనుకున్నారు?’ అని అడిగారట. దానికి పరశురాం నుండి ‘సర్కారు వారి పాట’ అని సమాధానం వచ్చిందట. దాంతో మహేష్‌ ‘టైటిల్‌ అదిరిపోయింది. ఇదే ఫిక్స్‌ చేయండి’ అని చెప్పారట. అలా ఆ రోజే సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేశారట.

పోస్టర్లు, టీజర్లు లీక్‌ అవ్వొచ్చు కానీ, ఏకంగా సినిమా టైటిల్‌ ఎలా లీకయ్యిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే అని అన్నారు మహేష్‌బబు. ఇక ట్రైలర్‌ రిలీజ్‌కి ముందు రోజు పడ్డ టెన్షన్‌ గురించి పరశురామ్‌ చెప్పారు. ఫైనల్‌ కట్‌తో ఓ వారం ముందే ట్రైలర్‌ సిద్ధం చేసుకున్నాం. లీకుల భయంతో ఆ వారమంతా నిద్రపట్టలేదు. విపరీతమైన టెన్షన్‌ పడ్డాను. ట్రైలర్‌ ఇచ్చిన కిక్‌ కంటే టెన్షనే ఎక్కువగా అనిపించింది అంటూ ఆసక్తికర విషయం చెప్పారు పరశురామ్‌.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus