సత్య దేవ్ (Satyadev) .. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi), ప్రభాస్ (Prabhas) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) , మహేష్ బాబు (Mahesh Babu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (Mukunda), ‘అంతరిక్షం’ (Antariksham 9000 KMPH) .. వంటి సినిమాల్లో సత్యదేవ్ చిన్న చిన్న పాత్రలు చేయడం జరిగింది. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దయ వల్ల హీరో ఛాన్స్ కూడా అతనికి లభించింది. ‘జ్యోతి లక్ష్మీ’ (Jyothi Lakshmi) సినిమాలో తొలిసారి హీరోగా నటించాడు సత్యదేవ్.
అలా అని కేవలం హీరోగానే నటించాలి అని పట్టుబట్టి కూర్చోలేదు. సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) చిత్రం ఇతనికి మొదటి సక్సెస్ ను అందించింది. అది ఓటీటీ హిట్. కానీ దాని తర్వాత సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ (Thimmarusu) ‘స్కై ల్యాబ్’ (Skylab) ‘గాడ్ సే’ (Godse) ‘గుర్తుందా శీతాకాలం’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
ఎందుకో 2022 లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) తర్వాత గ్యాప్ తీసుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత అతని నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. మొత్తానికి ఈ మే 10 న ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సత్యదేవ్. దీనిపై బజ్ అయితే లేదు. ఇంకో పక్క థియేటర్లలో సినిమా చూడటానికి జనాలు కూడా రావడం లేదు. ఇలాంటి టైంలో రిలీజ్ అవుతున్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ కి (Krishnamma) సూపర్ హిట్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ వస్తాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూడాలి మరి..!