పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నందు. హీరోగా కూడా పలు చిత్రాలు చేశాడు. వాటికి క్రిటిక్స్ నుండీ ప్రశంసలు దక్కాయి కానీ.. కమర్షియల్ గా వర్కౌట్ కాలేకపోయాయి. అయితే ఈసారి మాత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో హిట్టు కొట్టడానికి నందు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ‘సవారి’ అనే చిత్రంతో ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు నందు. ప్రియాంకా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేయడం విశేషం. అంతేకాదు మంచి కంటెంట్ ఉన్న చిత్రమని వారు ప్రశంసించారట. నందు నటనకి కచ్చితంగా మంచి మార్కులు పడతాయని చెప్పారని తెలుస్తుంది. ఇక దర్శకుడు సాహిత్ మోత్కూరి .. చాలా ఎంగేజింగ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని… అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నిర్మాతలైన సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కు వారు భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీ నుండీ నాగ చైతన్య వంటి వారు హీరో నందుకి.. ” ‘సవారి’ ట్రైలర్ చాలా బాగుందని.. ‘100% లవ్’ సినిమా టైం లో నందుతో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు.. నందు మరెన్నో చెయ్యాలి’ అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ట్రైలర్ తో కూడా సినిమా పై మంచి బజ్ ఏర్పడింది.
Most Recommended Video
View this post on Instagram
#NagaChaitanya about #Savaari movie
A post shared by Filmy Focus (@filmyfocus) on