మన తెలుగు సినిమా దర్శకులు పరాయి భాషా చిత్రాలు, వెబ్ సిరీస్ ల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అందుకు “కార్తికేయ” ఫేమ్ చందు మొండేటి కూడా మినహాయింపేమీ కాదని “సవ్యసాచి”తో ప్రూవ్ అయ్యింది. అయితే.. చందు మొండేటి విచిత్రంగా హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కాక.. ఒక జర్మనీ వెబ్ వీడియోను కాపీ కొట్టాడు. సవ్యసాచి ఓపెనింగ్ సీన్ చూస్తే ఆ విషయం ఈజీగా అర్ధమైపోతుంది. ఆ వీడియో కూడా ఒక అయిదారేళ్ళ క్రితం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వీడియో కావడం విశేషం.
సినిమా చూస్తున్నప్పుడే ఆల్మోస్ట్ సగానికి పైగా ఆ వీడియోకి కనెక్ట్ అయిపోవడంతో.. ఏంటి చందు మరీ ఇంత సింపుల్ వీడియో కాపీ కొట్టాడు. అది కూడా ఓపెనింగ్ సీన్ కి, స్క్రీన్ ప్లే కి కూడా ఆ సీన్ ను, ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ మొత్తం ఆ వీడియో బేస్డ్ కావడంతో పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయిందా చిత్రం. సినిమా రిజల్ట్ పక్కన పెడితే తన మొదటి రెండు సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకొన్న చందు మొండేటి ఇలా ఈ మూడో సినిమాతో దర్శకుడిగా ఉన్న పేరును పోగొట్టుకోవడం మాత్రం బాధాకరం, మరి తన తదుపరి చిత్రంతో ఆ బ్యాడ్ నేమ్ ను పోగొట్టుకుంటాడో లేదో చూడాలి.